Singer Sunitha: నా జీవితంలోకి రామ్ వచ్చాడు: సింగర్ సునీత

 Ram has entered my life says singer Sunitha
  • పిల్లలను సెటిల్ చేయాలని ప్రతి తల్లి మాదిరి నేను కూడా  కలలు కన్నా
  • ఆ క్షణం ఇప్పుడు నా జీవితంలో వచ్చింది
  • నేను, రామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం
సింగర్ సునీత కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని ఆమె పెళ్లాడబోతున్నారు. ఆమె తొలి వైవాహిక జీవితం విచ్ఛిన్నమైన సంగతి తెలిసిందే. తొలి భర్త నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు. కొన్ని రోజులుగా ఆమె రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తలపై ఆమె ఈరోజు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

ప్రతి తల్లి మాదిరే తాను కూడా తన పిల్లలను మంచిగా సెటిల్ చేయాలనే కలలు కన్నానని సునీత చెప్పారు. ఆ క్షణం ఇప్పుడు వచ్చిందని... తన జీవితంలో రామ్ ప్రవేశించాడని తెలిపారు. రామ్ ఒక మంచి స్నేహితుడే కాదు... ఒక మంచి భాగస్వామి కూడా అని అన్నారు. వైవాహిక బంధంతో తామిద్దరం ఒకటి కాబోతున్న తరుణంలో చాలా ఆనందంగా ఉన్నామని చెప్పారు. త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితాన్ని అర్థం చేసుకున్న అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ఇంతకాలం మీరు అందించిన ప్రేమాభిమానాలను ఇకపై కూడా అందిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
Singer Sunitha
Second Marriage
Tollywood

More Telugu News