Team India: ఆసీస్ తో రెండో టీ20: టీమిండియా టార్గెట్ 195 రన్స్

Australia set huge target to Teamindia in second match
  • సిడ్నీలో ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా
  • మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్
  • రాణించిన వేడ్, స్మిత్
  • మరోసారి ఆకట్టుకున్న నటరాజన్
సిడ్నీలో టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (58), స్టీవ్ స్మిత్ (46), హెన్రిక్స్ (26), మ్యాక్స్ వెల్ (22) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫించ్ గైర్హాజరీలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వేడ్ ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వేడ్ 32 బంతులాడి 10 ఫోర్లు, ఒక సిక్సు బాదాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్ అందరూ దూకుడుగా ఆడేందుకు ప్రాధాన్యమివ్వడంతో ఏ దశలోనూ స్కోరుబోర్డు విశ్రమించలేదు.

భారత బౌలర్లలో నటరాజన్ మరోసారి రాణించాడు. ఈ తమిళనాడు యార్కర్ స్పెషలిస్ట్ 2 వికెట్లు తీసి తన ఎంపికకు న్యాయం చేశాడు. షమీ, బుమ్రా వంటి అగ్రశ్రేణి బౌలర్ల గైర్హాజరీలో దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ తేలిపోయారు. తొలి టీ20 విజయంలో కీలకపాత్ర పోషించిన చహల్ ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు విసిరి 51 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.
Team India
Australia
2nd T20
Target
Sydney

More Telugu News