Drones: ప్రకాశం జిల్లా రామాయపట్నం తీరంలో ఎలక్ట్రానిక్ వస్తువుల కలకలం!

Drones wreckage comes to shores of Ramayapatnam and Isukapalli
  • హడలిపోయిన స్థానికులు
  • కూలిపోయిన డ్రోన్లు అని తేల్చిన అధికారులు
  • ఒడిశాలోని క్షిపణి ప్రయోగ కేంద్రానికి చెందినవంటున్న అధికారులు
  • ఇసుకపల్లిలోనూ ఇలాంటి డ్రోన్లే కొట్టుకొచ్చిన వైనం
ప్రకాశం జిల్లా రామాయపట్నంతో పాటు ఇసుకపల్లి సముద్రతీర ప్రాంతంలో ఎలక్ట్రానిక్ వస్తువులు అలలకు కొట్టుకొచ్చాయి. స్థానికులు వీటిని చూసి ఆందోళనకు గురయ్యారు. అయితే మెరైన్ పోలీసు అధికారులు వీటిని కూలిపోయిన డ్రోన్లుగా గుర్తించారు. యుద్ధ సమయాల్లో సైన్యం ఉపయోగించే డ్రోన్లు అని నిర్ధారించారు. ఒడిశాలోని బాలాసోర్ క్షిపణి ప్రయోగ కేంద్రంలో పరీక్షల సందర్భంగా ఇవి సముద్రంలో కూలిపోయి ఉంటాయని, అలలతో పాటు ప్రయాణిస్తూ ఇవి ఆంధ్రా తీరం వైపు వచ్చాయని భావిస్తున్నారు.
Drones
Wreckage
Ramayapatnam
Isukapalli
Beach
Odisha

More Telugu News