deve gouda: తన తండ్రి దేవెగౌడ గతంలో తీసుకున్న కీలక నిర్ణయంపై కుమార స్వామి వ్యాఖ్యలు

  • కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు
  • దేవెగౌడ ఒత్తిడి వల్లే ఆ పార్టీతో కలిశాం
  • మా పార్టీని బీజేపీ బీ టీమ్ అని కాంగ్రెస్ ప్రచారం చేసింది
  • దేవెగౌడ నిర్ణయంతో మా పార్టీ బలాన్ని కోల్పోవాల్సి వస్తోంది
my father took bad decision kumara swamy

తమ పార్టీ అధినేత, తన తండ్రి దేవెగౌడ గతంలో తీసుకున్న ఓ నిర్ణయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమార స్వామి తాజాగా తనలోని అసంతృప్తి వెళ్లగక్కారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కుమారస్వామి మాట్లాడుతూ... కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం తనకు ఇష్టం లేకపోయినప్పటికీ దేవెగౌడ ఒత్తిడి వల్లే ఆ పార్టీతో కలిశామని తెలిపారు.

తమ పార్టీని బీజేపీ బీ టీమ్ అని కాంగ్రెస్ ప్రచారం చేసిందని అన్నారు. అయినప్పటికీ, దేవెగౌడ ఈ పార్టీతో పొత్తుపై తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు తమ పార్టీ బలాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు. తన తండ్రి భావోద్వేగాలకు తాను పడిపోయానని, అయినప్పటికీ తన తండ్రి తీసుకున్న నిర్ణయానికి తనకేమీ విచారం లేదని అన్నారు.

ఆయన లౌకికవాద సిద్ధాంతానికి కట్టుబడే ఉన్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పన్నిన కుట్రలో తానూ ఇరుక్కున్నానని అన్నారు. బీజేపీ కూడా అంతలా ఎన్నడూ ద్రోహం చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాక తన మంచి పేరు పోయిందని చెప్పారు.అయితే, కుమార స్వామి అన్ని అసత్యాలు చెబుతున్నారని  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. రాజకీయాల స్వార్థ ప్రయోజనాలకోసమే ఆయన ఇలా మాట్లాడుతుంటారని చెప్పారు.

More Telugu News