Eluru: కలకలం రేపిన ఏలూరు ఘటనలో 20 మంది డిశ్చార్జ్

  • అంతుచిక్కని కారణాలతో వంద మందికిపైగా ఆసుపత్రిలో చేరిక
  • అందరిలోనూ ఒకే రకమైన లక్షణాలు
  • ఆందోళన అవసరం లేదన్న వైద్యులు
20 discharged from Eluru Hospital

అంతుచిక్కని కారణాలతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఏలూరు వాసుల్లో 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగతా వారికి వైద్య బృందం చికిత్స అందిస్తోంది. కళ్లు తిరగడం, వాంతులు వంటి లక్షణాలతో ఏలూరు వన్ టౌన్ పరిధిలోని పడమర వీధి, దక్షిణ వీధి ప్రాంతాలకు చెందిన దాదాపు వందమంది శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ఆసుపత్రిలో చేరడం కలకలం రేపింది. అందరిలోనూ ఒకే రకమైన లక్షణాలు కనిపించడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.  

సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న డిప్యూటీ సీఎం, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇన్‌చార్జ్ డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ పర్యవేక్షణలో వైద్య బృందం ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

More Telugu News