Ambati Rambabu: మళ్లీ కరోనా బారిన పడిన అంబటి రాంబాబు

YSRCP MLA Ambati Rambabu get infected by corona virus second time
  • నిన్న అసెంబ్లీలో కరోనా టెస్టు చేయించుకున్న అంబటి
  • పాజిటివ్ వచ్చిందని వెల్లడి
  • అవసరమైతే ఆసుపత్రిలో చేరతానంటూ ట్వీట్
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా సోకింది. గత జులైలో తనకు కొవిడ్ సోకిందని, కొన్నిరోజులకే కోలుకున్నానని అంబటి వెల్లడించారు. అయితే నిన్న మరోసారి అసెంబ్లీలో కరోనా టెస్టు చేయించగా, పాజిటివ్ అని వెల్లడైందని తెలిపారు. రీఇన్ఫెక్షన్ కు గురికావడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. అవసరమైతే ఆసుపత్రిలో చేరతానని, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్ ను మరోసారి జయించి వస్తానని అంబటి ధీమా వ్యక్తం చేశారు.
Ambati Rambabu
Corona Virus
Second Time
Positive
YSRCP

More Telugu News