Hariteja: తల్లి కాబోతున్న సినీనటి హరితేజ

Hariteja is going to be a mother
  • నాలుగేళ్ల క్రితం దీపక్ రావును పెళ్లాడిన హరితేజ
  • తొలుత సీరియల్స్ లో నటించిన హరితేజ
  • బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ 
సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ హరితేజ త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెపుతున్నారు. లాక్ డౌన్  నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆమె షూటింగులకు దూరంగా ఉంది.

హరితేజ తొలుత సీరియల్స్ లో నటించింది. అనంతరం బుల్లితెరపై తన యాంకరింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్యారక్టర్ నటిగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. బిగ్ బాస్ లో సైతం బుల్లితెర అభిమానులను అలరించింది. నాలుగేళ్ల క్రితం దీపక్ రావు అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది.
Hariteja
Bigg Boss
Pregnant

More Telugu News