నాగశౌర్య తాజా చిత్రం 'శ్రీకృష్ణ-సత్యభామ'?

05-12-2020 Sat 12:25
  • 'వరుడు కావలెను', 'లక్ష్య' చిత్రాలలో నాగశౌర్య 
  • అనీష్ కృష్ణ దర్శకత్వంలో తాజా చిత్రం
  • శ్రీకృష్ణ, సత్యభామలను పోలిన పాత్రలు
  • హైదరాబాదులో రెగ్యులర్ షూటింగ్  
Naga shouryas latest film titled

యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం ఓపక్క 'వరుడు కావలెను', మరోపక్క 'లక్ష్య' చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే సొంత చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది.

ఆక్లాండ్ కు చెందిన పాప్ సంచలనం షెర్లీ సేషియా ఇందులో కథానాయికగా నటిస్తోంది. కాగా, ఈ చిత్రంలో హీరో పాత్ర శ్రీకృష్ణుడు, హీరోయిన్ పాత్ర సత్యభామ తరహా పురాణ పాత్రలను గుర్తుకు తెస్తాయట. దాంతో దీనికి 'శ్రీకృష్ణ-సత్యభామ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కథకు ఇది బాగా సూటవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. దీనికి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.