హైదరాబాద్‌లో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
- బేగంపేటలో ఘటన
- గాంధీ ఆసుపత్రి కళాశాలలో చదువుతోన్న ఝాన్సీ
- స్వస్థలం మెదక్ జిల్లాలోని నర్సాపూర్
- మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య?
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆమె ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేశారు. ఆమె మానసిక ఒత్తిడితో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఝాన్సీ స్వస్థలం మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.