Viktor Martynov: 49 డాలర్ల ఫుడ్డు కోసం హెలికాప్టర్ బుక్ చేసుకుని 725 కిమీ ప్రయాణించిన ప్రేమజంట!

  • ప్రేయసితో రష్యా కంపెనీ సీఈవో విహారయాత్ర
  • నచ్చిన ఫుడ్డు దొరక్క ఇబ్బందులు
  • రూ.2 లక్షల ఖర్చుతో హెలికాప్టర్ ప్రయాణం
Russian CEO traveled hundreds of kilometres to eat burger in a McDonalds outlet

రష్యాలో ఓ వ్యక్తి విహారయాత్రలో నచ్చిన ఆహారం దొరకలేదని లక్షలు ఖర్చు చేసిన వైనం ఆసక్తి కలిగిస్తోంది. విక్టర్ మార్టినోవ్ (33) అనే వ్యక్తి మాస్కోలో ఓ సంస్థకు సీఈవోగా పనిచేస్తున్నాడు. అయితే ప్రేయసితో సరదాగా గడిపేందుకు క్రిమియా ప్రాంతంలోని అలుస్తా అనే పట్టణానికి వెళ్లాడు. అయితే ఆ ప్రాంతంలో లభించే ఆహారం మార్టినోవ్, అతని ప్రియురాలికి నచ్చలేదు. ఏదైనా మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ కనిపిస్తుందేమోనని ఆ ప్రాంతంలో వెతికితే ఒక్కటి కూడా కనిపించలేదు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అక్కడికి 725 కిలోమీటర్ల దూరంలోని క్రాస్నోదార్ లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ ఉన్నట్టు తెలిసింది. దాంతో మార్టినోవ్ రూ.2 లక్షల ఖర్చు చేసి ఓ హెలికాప్టర్ లో తన ప్రేయసితో కలిసి ఎంతో దూరంలో ఉన్న రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ ఆ జంట 49 డాలర్ల ఖరీదు చేసే బర్గర్ లు, ఫ్రైస్, మిల్క్ షేకులతో ఆకలి తీర్చుకుని తిరిగి అలుస్తాలో తాము బస చేసిన హోటల్ కు చేరుకున్నారు.

దీనిపై మార్టినోవ్ మాట్లాడుతూ, తాను, తన ప్రేయసి ఆర్గానిక్ ఆహారంతో విసిగిపోయామని, దాంతో సాధారణ ఆహారాన్ని తిందామని భావించామని వెల్లడించారు. అందుకే హెలికాప్టర్ అద్దెకు తీసుకుని క్రాస్నోదార్ వెళ్లామని చెప్పాడు.

More Telugu News