TRS: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: తొలి రౌండ్ లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ

Tug of war between TRS and BJP in GHMC Elections counting
  • జోరుగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ
  • 34 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం
  • 28 డివిజన్లలో బీజేపీ ముందంజ
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్ ఫలితాలు వెలువడుతున్న క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ నెలకొంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 34 డివిజన్లలో ఆధిక్యంలో నిలిచింది. యూసఫ్ గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ 28 డివిజన్లలో ముందంజలో ఉంది. ఎంఐఎం 5 డివిజన్లలో నెగ్గి, 11 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 3 డివిజన్లలో ముందంజలో కొనసాగుతోంది.

కాగా, రంగారెడ్డి నగర్, చైతన్యపురి, నల్లకుంటలో బీజేపీ ముందంజలో ఉండగా, సనత్ నగర్, గోల్నాక, చింతల్, గౌతమ్ నగర్, హైదర్ నగర్ లో టీఆర్ఎస్ ఆధిక్యం పొందింది. గడ్డి అన్నారం డివిజన్ లో 2,600 ఓట్లతో బీజేపీ దూసుకుపోతోంది. అటు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వెంకటేశ్వరనగర్ కాలనీ, అంబర్ పేట్, మలక్ పేట్, షేక్ పేట డివిజన్లలో కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.
TRS
BJP
Counting
GHMC Elections
Hyderabad

More Telugu News