తొలి టీ20 మ్యాచ్: టాస్ గెలిచిన ఆసీస్... టీమిండియాకు బ్యాటింగ్

04-12-2020 Fri 13:30
  • కాన్ బెర్రా మనూకా ఓవల్ మైదానంలో మ్యాచ్
  • టీమిండియాలో పలువురు కుర్రాళ్లకు చోటు
  • తొలి టీ20 ఆడనున్న నటరాజన్
Australia won the toss and elected bowl first against Team India

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా నేడు తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. కాన్ బెర్రాలోని మనూకా ఓవల్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన కోహ్లీ సేన టీ20 సిరీస్ చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మనీష్ పాండే, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, నటరాజన్ లకు స్థానం కల్పించారు.

కాగా నటరాజన్ కిది తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. వన్డే సిరీస్ చివరి  మ్యాచ్ లో ఆకట్టుకునేలా బౌలింగ్ చేసిన ఈ తమిళనాడు యార్కర్ స్పెషలిస్ట్ జట్టు మేనేజ్ మెంట్ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఇక, ఆతిథ్య ఆసీస్ జట్టులో డార్సీ షార్ట్, మాథ్యూ వేడ్, మిచెల్ స్వెప్సన్ తుది జట్టులోకి వచ్చారు.