జీహెచ్ఎంసీ ఎన్నికలు: పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ 82, టీఆర్ఎస్ 31 సీట్లలో ఆధిక్యం

BJP Leads in GHMC Elections
  • 82 చోట్ల ఆధిక్యంలో బీజేపీ
  • పాతబస్తీలో సైతం బీజేపీ ముందంజ
  • 16 చోట్ల ఎంఐఎం, 4 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ట్రెండ్స్ విడుదలవుతున్నాయి. మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఈ ఉదయం మొదలైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రెండ్స్ ప్రకారం, భారతీయ జనతా పార్టీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఆర్ఎస్ 31 స్థానాల్లో, ఎంఐఎం 16, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఎంఐఎంకు గట్టి పట్టున్న పాతబస్తీలో సైతం పోస్టల్ బ్యాలెట్ లో పలు చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండటంతో ఫలితాల సరళిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Go Back to Shorts
GHMC
Greater
Elections
BJP
TRS

More Telugu News