హైదరాబాద్‌లో భారీగా పెరిగిన భూగర్భ జలాలు!
- నగరంలో ఇటీవల విస్తారంగా వానలు
- చెరువులు నిండడంతో పెరిగిన భూగర్భ జలాలు
- రెండు మీటర్ల నుంచి ఎనిమిదిన్నర మీటర్ల వరకు పెరిగిన వైనం
అక్టోబరు నెలలో కురిసిన వానలకు శివార్లలో దాదాపు అన్ని చెరువుల్లోనూ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. చెరువులన్నీ నిండడంతో శివార్లలో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. రాజేంద్రనగ్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లితోపాటు పలు ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరిగాయి.
ప్రతి వేసవిలోను నీటి ఎద్దడి తలెత్తుతుండడంతో నగర వాసులు చాలామంది ఇంకుడు గుంతల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విస్తారంగా వానలు కురవడంతో నీరు భూమిలో ఇంకేందుకు ఇవి ఎంతగానో దోహదపడ్డాయని చెబుతున్నారు.