కంగన రనౌత్‌పై పరువునష్టం కేసు.. కోర్టుకు హాజరైన జావేద్ అఖ్తర్

03-12-2020 Thu 17:36
  • ఓ ఇంటర్వ్యూలో జావెద్ అఖ్తర్ గురించి మాట్లాడిన కంగన
  • తన పరువుకు భంగం కలిగించారంటూ కేసు వేసిన అఖ్తర్
  • తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా 
Javed Akhtar attends court on defamation case against Kangana Ranaut

ప్రముఖ సినీనటి కంగనా రనౌత్ తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అఖ్తర్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి ముంబైలోని అంధేరీ కోర్టుకు ఈరోజు అఖ్తర్ హాజరయ్యారు. తన గుర్తింపు, ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు చూపించారు. వివరాల వెరిఫికేషన్ పూర్తి కావడంతో... తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంశంపై కంగన మాట్లాడుతూ జావెద్ అఖ్తర్ పేరును ప్రస్తావించింది. ఆ ఇంటర్వ్యూకు ఆన్ లైన్లో లక్షలాది వ్యూస్ వచ్చాయి. దీంతో, తన పరువుకు భంగం కలిగించేలా కంగన వ్యాఖ్యానించిందని అఖ్తర్ కోర్టును ఆశ్రయించారు.