మెగా డాటర్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌.. ఫొటోలు ఇవిగో!

03-12-2020 Thu 13:36
  • నిహారిక కొణిదెల పెళ్లికి పూర్తవుతున్న ఏర్పాట్లు
  • డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి
  • ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో ప్రముఖుల సందడి
niharika pics go viral

సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్న ఈ పెళ్లి వేడుకల పనిలో నాగబాబు కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. ఇప్ప‌టికే హ‌ల్దీ వేడుక పూర్తయింది.

   
మెహందీ, సంగీత్ వేడుక‌లూ జ‌ర‌గ‌నున్నాయి. పెళ్లి నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా నిహారికతో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా నిహారిక‌, చైత‌న్య‌తో క‌లిసి శ్రీజ, సుస్మిత‌, స్నేహా రెడ్డి, శిరీష్‌, సాయి ధ‌రమ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్, వ‌రుణ్ తేజ్, అల్లు శిరీష్ వంటి పలువురు ప్రముఖులు ఫొటోలు దిగారు. కాగా, ఈ నెల 11న హైద‌రాబాద్‌లో విందుకు ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌ని ఆహ్వానించ‌నున్నారు.