హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఒకే రోజు రెండు శుభవార్తలు!
- నేటి నుంచి అందుబాటులోకి జేబీఎస్-ఎంజీబీఎస్, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాలు
- తెరుచుకున్నమూడు స్టేషన్లు
- రాత్రి 9.30 గంటలకు చివరి రైలు
ఎల్బీనగర్, అమీర్‌పేట, మియాపూర్, ఎంజీబీఎస్ టర్మినల్ స్టేషన్ల నుంచి రాత్రి 9.30 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని పేర్కొన్నారు. అలాగే, మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైనప్పటికీ తెరుచుకోని ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్ మెట్రో స్టేషన్లలో నేటి నుంచి తిరిగి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉండడంతో ఈ స్టేషన్లను ఇప్పటి వరకు మూసి ఉంచారు.