అల్లు అర్జున్‌కి తన బ్రాండ్ దుస్తులు పంపిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫొటోలు పోస్ట్ చేసిన బన్నీ!

03-12-2020 Thu 10:15
  • ‘రౌడీ’ బ్రాండ్ తో విజయ్ దేవరకొండ వస్త్ర వ్యాపారం 
  • గ‌తంలోనూ అల్లు అర్జున్‌కి డ్రెస్ పంపిన బన్నీ
  • దుస్తులు చాలా సౌకర్యకరంగా ఉన్నాయన్న అల్లు అర్జున్
vijay sends cloths to bunny

సినీనటుడు అల్లు అర్జున్‌కి టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త దుస్తులు పంపాడు. ‘రౌడీ’ బ్రాండ్ తో విజయ్ దేవరకొండ వస్త్ర వ్యాపారం చేస్తోన్న విషయం విదితమే. గ‌తంలోనూ తమ రౌడీ బ్రాండ్ వస్త్రాలను అల్లు అర్జున్‌కి విజ‌య్ దేవరకొండ పంపాడు. 'అల వైకుంఠ‌పుర‌ములో' సినిమా వేడుక‌లో వాటిని బన్నీ ధ‌రించి అలరించాడు.

తాజాగా, మరోసారి స్టైలిష్ స్టార్‌కు విజయ్ దేవరకొండ స్టైలిష్ బట్టలు పంపడంతో వాటిని ధరించి ఫొటోలు దిగి అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వాటిని తనకు పంపిన విజ‌య్ దేవరకొండతో పాటు రౌడీ క్ల‌బ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ దుస్తులు చాలా సౌకర్యకరంగా ఉన్నాయని, విజయ్ దేవరకొండ చూపించే ప్రేమ‌కు థ్యాంక్స్ చెబుతున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.