Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఒకే రోజు రెండు శుభవార్తలు!

metro services resumed in Bharathnagar Musheerabad stations from today
  • నేటి నుంచి అందుబాటులోకి జేబీఎస్-ఎంజీబీఎస్, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాలు
  • తెరుచుకున్నమూడు స్టేషన్లు
  • రాత్రి 9.30 గంటలకు చివరి రైలు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఒకే రోజు రెండు శుభవార్తలు. ఈ ఉదయం నుంచి ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైన సేవలు రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కొనసాగుతాయని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

ఎల్బీనగర్, అమీర్‌పేట, మియాపూర్, ఎంజీబీఎస్‌ టర్మినల్‌ స్టేషన్ల నుంచి రాత్రి 9.30 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని పేర్కొన్నారు. అలాగే, మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైనప్పటికీ తెరుచుకోని ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్‌ మెట్రో స్టేషన్లలో నేటి నుంచి తిరిగి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉండడంతో ఈ స్టేషన్లను ఇప్పటి వరకు మూసి ఉంచారు.

  • Loading...

More Telugu News