నీహారిక వెడ్డింగ్ కార్డు చూశారా?... వీడియో ఇదిగో!

02-12-2020 Wed 08:32
  • 9న రాజస్థాన్ లో నీహారిక, చైతన్య వివాహం
  • 11న హైదరాబాద్ లో రిసెప్షన్
  • వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్
Mega Daughter Niharika Wedding Card Unveil Video

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక వివాహానికి సమయం దగ్గర పడింది. ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నీహారిక వివాహం జరుగనుండగా, ఆపై 11న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో రిసెప్షన్ జరుగనుంది. ఈ నేపథ్యంలో నీహారిక పెళ్లి శుభలేఖలను నాగబాబు ఫ్యామిలీ పంచడం ప్రారంభించగా, ఆ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉదయ్ పూర్ ప్యాలెస్ ముందు ఏనుగు అంబారీలున్న ఆర్ట్ ను ముద్రించిన బాక్స్ లో వివాహానికి సంబంధించిన వివరాలను మెగా ఫ్యామిలీ తెలియజేసింది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.