తిరుమలలో గణనీయంగా తగ్గిన రద్దీ!

02-12-2020 Wed 08:14
  • పెరిగిన చలి, కొనసాగుతున్న కరోనా భయం
  • మంగళవారం 19,046 మందికి స్వామి దర్శనం
  • హుండీ ద్వారా 1.86 కోట్ల ఆదాయం
No Rush in Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. చలి తీవ్రత పెరగడం, కరోనా భయాలు కొనసాగుతుండటం, వరుస సెలవులు ముగియడంతోనే భక్తుల సందడి పలుచగా ఉంది. మంగళవారం నాడు స్వామిని 19,046 మంది దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 1.86 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల గిరులపై కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ జరుగుతోందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.