sunney deol: బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీడియోల్‌కు కరోనా

Bollywood actor sunney deol tests corona positive
  • ఇటీవల భుజానికి శస్త్రచికిత్స
  • మనాలిలోని ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి
  • ముంబై వెళ్లేందుకు పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ
బాలీవుడ్ ప్రముఖ నటుడు, గురుదాస్‌పూర్ బీజేపీ ఎంపీ సన్నీడియోల్ కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం ఆయన హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో ఉంటున్నారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న 64 ఏళ్ల సన్నీడియోల్ మనాలీ సమీపంలోని ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

తాజాగా, సన్నీడియోల్, ఆయన స్నేహితులు ముంబై వెళ్లేందుకు సిద్ధమై కరోనా పరీక్షలు చేయించుకున్నారు. నిన్న ఫలితాలు రాగా సన్నీకి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని హిమాచల్‌ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థి తెలిపారు. దీంతో ఆయన తిరిగి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు.
sunney deol
Bollywood
Corona Virus
Gurdas pur
BJP

More Telugu News