జపాన్ గగనతలాన్ని దేదీప్యమానంగా వెలిగించిన ఉల్క.. సందడి చేస్తున్న వీడియోలు!

01-12-2020 Tue 22:06
  • ఆదివారం వేకువజామున కనువిందు చేసిన ఉల్క
  • జపాన్ లోని అనేక ప్రాంతాల్లో దర్శనం
  • వెలుగుతో నిండిపోయిన ఆకాశం
Huge meteor enlighten Japan sky

ద్వీపదేశం జపాన్ లో గత ఆదివారం వేకువజామున ఓ ఉల్క కనువిందు చేసింది. ఇది ఎంత పెద్ద ఉల్క అంటే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇది దర్శనమిచ్చింది. పున్నమి వెన్నెలను మించిన కాంతితో ఈ భారీ ఉల్క జపాన్ గగనతలాన్ని జిగేల్మనిపించింది. మండుతున్న అగ్నిగోళంలా భూవాతావరణంలో ప్రవేశించిన ఈ ఉల్క ఒక్కసారిగా విస్ఫోటనం చెందినట్టుగా వెలుగులు విరజిమ్మింది. ఈ ఉల్క ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, క్యోటో, యమగుచి, ఒకాయామో, షిజువోకా వంటి అనేక ప్రాంతాల్లో కనిపించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.