ఏపీ సర్కారు కట్టబోతున్న నమూనా ఇళ్ల ఫొటోలు ఇవిగో!

01-12-2020 Tue 21:28
  • పేదలకు ఇళ్ల స్థలాలు
  • డిసెంబరు 25న పంపిణీ
  • అదే రోజున ఇంటి నిర్మాణాల ప్రారంభం!
AP Government model house

ఏపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు తక్కువ వ్యయంతో గృహ నిర్మాణం పూర్తయ్యేలా నమూనా ఇళ్లు రూపొందించింది. ఈ నమూనా ఇళ్ల ఫొటోలను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. చిన్నవిగా ఉన్నా ఎంతో పొందికగా కనిపిస్తున్న ఆ ఇళ్ల తరహాలో ప్రభుత్వం ఇళ్లు కట్టబోతోంది అంటూ సీఎంవో వెల్లడించింది.

కాగా, కోర్టు స్టేలతో వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీని డిసెంబరు 25న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 30,68,281 మంది లబ్దిదారులను గుర్తించారు. కోర్టు స్టేలు లేని ప్రాంతాల్లో డి-ఫాం పట్టాతో ఇళ్ల స్థలాలు అందించనున్నారు. కాగా, డిసెంబరు 25న ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు అదే రోజున ఆయా స్థలాల్లో ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.