రైతు సంఘాల నేతలతో అసంపూర్తిగా ముగిసిన కేంద్రం చర్చలు

01-12-2020 Tue 20:30
  • రైతు ప్రతినిధులతో కేంద్రమంత్రుల భేటీ
  • చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతు సంఘాల నేతలు
  • ఎల్లుండి మరోసారి సమావేశం
Farmers meeting with Union Ministers ended in a incomplete manner

జాతీయ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న రైతు సంఘాలతో కేంద్రమంత్రులు భేటీ కావడం తెలిసిందే. అయితే రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ రైతు సంఘాలు కేంద్రానికి తేల్చిచెప్పాయి. కమిటీ ఏర్పాటు కొత్త చట్టాలకు పరిష్కారం కాదని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఎల్లుండి మరోసారి రైతు సంఘాల నేతలతో చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. చర్చలు పూర్తయ్యేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతు సంఘాలు వెల్లడించాయి.