గ్రేటర్ ఎన్నికల ఓటరు లిస్టులో తన పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన మల్లు రవి

01-12-2020 Tue 15:48
  • కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్
  • జూబ్లీహిల్స్ లో ఓటు వేసేందుకు వచ్చిన మల్లు రవి
  • ఓటు గల్లంతు కావడంపై అధికారులకు ఫిర్యాదు
Mallu Ravi complaints to officials after his vote not listed

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవికి జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఊహించని పరిణామం ఎదురైంది. ఎంతో ఉత్సాహంతో ఓటు వేసేందుకు జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన మల్లు రవికి దిగ్భ్రాంతికర పరిణామం ఎదురైంది. ఓటరు లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తన ఓటు గల్లంతు అయిందని ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు.

మల్లు రవి మాత్రమే కాదు, నగరంలోని అనేకమంది ఓటర్లకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఆన్ లైన్ ఓటరు లిస్టులో పేరున్నా, బూత్ వద్ద ఓటరు లిస్టులో పేరు లేకపోవడంతో ఓటర్లు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఓటరు స్లిప్ లు చేతికందినా, జాబితాలో పేరు లేకపోవడం పట్ల ఓటర్లు వాపోతున్నారు.