Petition: కార్యాలయాలకు వైసీపీ రంగులపై పిటిషన్... విచారణ వాయిదా

Petition filed on party colours for Panchayat buildings
  • ప్రజాధనం వృథా అయిందన్న పిటిషనర్
  • రూ.4 వేల కోట్లను రాబట్టాలని విజ్ఞప్తి
  • సీఎస్, మంత్రులను ప్రతివాదులుగా చేర్చిన వైనం
  • అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం పట్ల విమర్శలు రావడం తెలిసిందే. ఆపై ప్రభుత్వం ఆ రంగులను తొలగించింది. ఈ అంశంలో హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. రంగులేసి తీసినందుకు రూ.4 వేల కోట్లు ఖర్చయ్యాయని, వృథా అయిన ఆ ప్రజాధనం మొత్తాన్ని రాబట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రూ.4 వేల కోట్లను ఖజానాకు జమ చేయాలని పిటిషనర్ కోరారు.

రాష్ట్ర సీఎస్, మంత్రులు బొత్స, బుగ్గన లను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చుతూ ఈ పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ సరిగా వేయాలని పిటిషనర్ ను ఆదేశించింది. సీఎస్, మంత్రులను ఎందుకు ప్రతివాదులుగా చేర్చారంటూ ప్రశ్నించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
Petition
YCP Colours
Panchayat Offices
AP High Court

More Telugu News