తన తండ్రి మహేశ్ బాబుకు సంబంధించిన ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన సితార

01-12-2020 Tue 12:54
  • మంచంపై పడుకున్న మహేశ్ బాబు
  • వీడియో తీసిన సితార
  • ముఖం కనపడకుండా దాక్కోడానికి మహేశ్ యత్నం
  • ‘నాన్నా.. నా కెమెరా నుంచి నువ్వు తప్పించుకోలేవు’ అంటూ సితార పోస్ట్
sitara shares mahesh babu video

మంచంపై పడుకున్న సినీ హీరో, తన తండ్రి మహేశ్ బాబుకు సంబంధించి తీసిన దృశ్యాలను సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సితార కెమెరాకు చిక్కకుండా మహేశ్ తప్పించుకునేందుకు ప్రయత్నాలు జరిపాడు. తన ముఖం కనపడకుండా తన చేతులను అడ్డుగా పెట్టుకుని, ముఖాన్ని బెడ్ వైపునకు తిప్పాడు.
 
‘నాన్నా.. నా కెమెరా నుంచి నువ్వు తప్పించుకోలేవు’ అంటూ సితార ఈ వీడియోను పోస్ట్ చేసింది. మహేశ్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, సితార కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తమకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తరుచూ పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం మహేశ్ బాబు చేతిలో ‘సర్కారు వారి పాట’ సినిమా ఉన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా కుటుంబ సభ్యులతోనే తమ సమయాన్ని గడుపుతోన్న మహేశ్ బాబు ఈ సందర్భంగా తన పిల్లలతో సరదాగా ఆడుకుంటోన్న వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి.