చంద్రబాబు నాయుడికి మోసం చేయడం మాత్రమే తెలుసు: అసెంబ్లీలో జగన్ ఆగ్రహం

01-12-2020 Tue 10:40
  • నేను ఏదైనా మాట చెబితే ఆ మాటను నిలబెట్టుకుంటా
  • ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది
  • సభలో బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ కుట్ర  
  • డిసెంబరు 25న ఇళ్ల పట్టాల పంపిణీ
jagan slams chandrababu in assembly

ఆంధ్రప్రదేశ్‌ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ఈ రోజు 10 బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చ జరగాల్సి ఉంది. టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. హౌసింగ్‌పై చర్చకు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై చర్చించాలని ఇప్పటికే సర్కారు అజెండాలో పెట్టినందున వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
 
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ... తాను ఏదైనా మాట చెబితే ఆ మాటను నిలబెట్టుకుంటానని ప్రజల్లో విశ్వాసం ఉందని చెప్పారు. చంద్రబాబునాయుడికి మాత్రం మోసం చేయడమే తెలుసని చెప్పారు. సభలో బిల్లులపై చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. డిసెంబరు 25న ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు.  సభలో సభ్యులు మాట్లాడే మాటలు వినకుండా టీడీపీ గంగరగోళం సృష్టిస్తోందని చెప్పారు.