Secunderabad: సికింద్రాబాద్ నుంచి ముందే వెళ్లిపోయిన శాలిమార్, తెలంగాణ ఎక్స్ ప్రెస్ లు... ప్రయాణికుల ఆందోళన!

Travellers Protest at Secunderabad Railway Station
  • రెండు గంటల ముందే వెళ్లిపోయిన శాలిమార్ ఎక్స్ ప్రెస్
  • గంట ముందే ప్లాట్ ఫామ్ ను వీడిన తెలంగాణ ఎక్స్ ప్రెస్
  • సమయం గురించి సమాచారం ఇవ్వలేదని వందలాది మంది నిరసన
ఢిల్లీకి వెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకుని, ఈ తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకున్న ప్రయాణికులు ప్రస్తుతం ఆందోళనకు దిగారు. ఉదయం 5.40 గంటలకు బయలుదేరాల్సిన శాలిమార్ ఎక్స్ ప్రెస్ 3.45కే ప్లాట్ ఫామ్ ను వీడి వెళ్లిపోయింది. ఇదే సమయంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ నిర్ణీత సమయం కన్నా గంట ముందే బయలుదేరింది. దీంతో రైళ్ల సమయంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తూ, ప్రయాణికులు నిరసనలకు దిగారు. ఈ విషయమై అధికారులు ఇంకా స్పందించలేదు.
Secunderabad
Telangana Express
Shalimar
Station
Protest

More Telugu News