America: ట్రంప్ వివాదాస్పద సలహాదారు స్కాట్ అట్లాస్ రాజీనామా

Trumps Controversial Coronavirus Advisor scott atlas resigns
  • రాజీనామా లేఖను పంపిన స్కాట్ అట్లాస్
  • తనకు ఈ గౌరవాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు
  • వైరస్ తీవ్రతను తక్కువ చేసి చూపించారంటూ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా వైరస్‌పై సలహాదారుడిగా ఉన్న స్కాట్ అట్లాస్ తన పదవికి రాజీనామా చేశారు. వివాదాస్పద సలహాదారుడిగా పేరు పొందిన ఆయన తన రాజీనామా లేఖను ట్రంప్‌కు పంపించారు. ట్రంప్ పత్యేక సలహాదారుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్న ఆయన.. తనకు ఈ గౌరవాన్ని కల్పించిన ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, కొత్త అధ్యక్షుడు జో బైడన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.  

కరోనా మహమ్మారి కాలంలో దాని నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు, అమెరికన్లకు సాయం చేసేందుకు తాను ఎంతగానో కష్టపడ్డానని పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్ నియంత్రణకు ఫేస్ మాస్కులు ధరించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటనకు అట్లాస్ వ్యతిరేకంగా మాట్లాడి విమర్శల పాలయ్యారు. ఫేస్‌మాస్కుల వల్ల ప్రయోజనం ఉండదన్న ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ దానిని తక్కువగా చేసి చూపించేందుకు ప్రయత్నించారన్న విమర్శలు కూడా అట్లాస్‌పై ఉన్నాయి.
America
Donald Trump
Scott Atlas
resign
Corona Virus

More Telugu News