ఆ వ్యక్తి టీడీపీకి చెందినవాడు కాదు... దాడితో మాకేంటి సంబంధం?: కొల్లు రవీంద్ర

29-11-2020 Sun 20:42
  • మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నం
  • దాడికి యత్నించింది టీడీపీకి చెందినవాడంటూ ప్రచారం
  • ప్రచారాన్ని ఖండించిన కొల్లు రవీంద్ర
Kollu Ravindra responds to attack on Perni Nani issue

మచిలీపట్నంలో ఇవాళ మంత్రి పేర్ని నానిపై దాడి జరిగిందన్న వార్త కలకలం రేపింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి మంత్రిపై తాపీతో దాడికి యత్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే నాగేశ్వరరావు టీడీపీకి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆ వ్యక్తితో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఉపాధి లేక కార్మికులు ఆక్రోశం వ్యక్తం చేస్తుంటే, టీడీపీ ఏం సంబంధమని అన్నారు. మంత్రిపై దాడి యత్నానికి, టీడీపీకి ముడివేస్తూ వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీ సృష్టించిన కృత్రిమ ఇసుక కొరతతో 60 మంది కార్మికులు చనిపోయారని ఆరోపించారు. దీనికి వైసీపీ నేతలు ఏం జవాబు చెబుతారని నిలదీశారు.