Jagan: జగన్ కేసులో తన పేరు తొలగించాలని శ్రీలక్ష్మి పిటిషన్!

  • 2016లో అదనపు చార్జ్ షీట్ వేసిన సీబీఐ
  • అప్పట్లో గనుల శాఖలో పనిచేసిన శ్రీలక్ష్మి
  • తన పేరును తొలగించాలని తాజాగా పిటిషన్
Sri Lakshmi ptition in High Court

ప్రస్తుతం విచారణ దశలో ఉన్న వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో తమ పేరును తొలగించాలని గనుల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. సీబీఐ దాఖలు చేసిన అదనపు చార్జ్ షీట్ లో తన పేరును చేర్చడాన్ని ఆమె సవాల్ చేశారు.

2016లో సీబీఐ వేసిన అదనపు చార్జ్ షీట్ లో శ్రీలక్ష్మితో పాటు అప్పటి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, రెవెన్యూ కార్యదర్శి ఎం శామ్యూల్, ప్రభుత్వ అధికారి సుదర్శన్ రెడ్డి పేర్లను చేర్చిన సంగతి తెలిసిందే. పెన్నా సిమెంట్స్ కు అనంతపురం, కర్నూలు జిల్లాలో భూమిని లీజుకు ఇవ్వడం వల్ల ఆ సంస్థ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిందన్నది సీబీఐ ఆరోపణ.

More Telugu News