క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్న సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'

28-11-2020 Sat 19:25
  • సాయితేజ్, నభా నటేశ్ జంటగా సోలో బ్రతుకే సో బెటర్
  • డిసెంబరు 25న విడుదల
  • థియేటర్లలో ఈలలు, చప్పట్లు వినాలనుందన్న సాయితేజ్
Saitej new movie Solo Brathuke So Better set to release in Theaters on Christmas

మెగా హీరో సాయితేజ్, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై సుబ్బు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టయినర్ ఈ క్రిస్మస్ కానుకగా వస్తోంది. అది కూడా థియేటర్లలో రిలీజవుతోంది. జీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేటర్లలో విడుదల చేస్తోంది. ఈ మేరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి.

దీనిపై హీరో సాయితేజ్ ట్వీట్ చేస్తూ, థియేటర్లలో ఆడియన్స్ ఈలలు, చప్పట్లు వినేందుకు ఆగలేకపోతున్నానని పేర్కొన్నారు. కొత్త పరిస్థితుల నడుమ థియేటర్లలో వస్తున్న తన చిత్రం ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు సమీపంలోని థియేటర్లలోకి వస్తోంది అంటూ వెల్లడించారు.