వరదల సమయంలో జనాల దగ్గరకు కేసీఆర్ వచ్చారా?: బండి సంజయ్

28-11-2020 Sat 14:25
  • పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూలుస్తామని ఒవైసీ అంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదు
  • మేము మాట్లాడితే కేసులు పెట్టారు
  • కేసీఆర్ కు కరోనా వ్యాక్సిన్ అవసరం లేదు
KCR donst want Corona Vaccine says Bandi Sanjay

ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు జనాలు గుర్తుకు వస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చేస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడితే కేసీఆర్ ఇంత వరకు స్పందించలేదని అన్నారు. ఆ వ్యాఖ్యలను తప్పుబట్టిన తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కుల సంఘాల పేరుతో మీటింగులు పెడుతున్న టీఆర్ఎస్ కు సిగ్గులేదని అన్నారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ కు జనాలు గుర్తుకొస్తారని విమర్శించారు.

కరోనా వ్యాక్సిన్ పై సమీక్ష కోసం ప్రధాని మోదీ హైదరాబాదుకు వస్తున్నారని... తనను పిలవలేదని కేసీఆర్ అంటున్నారని... ఇన్ని రోజులు కేసీఆర్ ఏం చేశారని పిలుస్తారని ఎద్దేవా చేశారు. సీఎంకు కరోనా వ్యాక్సిన్ అవసరం లేదని... ప్రైవేట్ ఆసుపత్రులతో ఆయన కుమ్మక్కయ్యారని విమర్శించారు. వరదలప్పుడు ప్రధాని రాలేదని కేసీఆర్ అంటున్నారని... వరదల సమయంలో కేసీఆర్ వచ్చారా అని ప్రశ్నించారు. జనాలు వరదల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని అన్నారు.