మోదీ పర్యటన నేపథ్యంలో నన్ను పిలవలేదు: రేవంత్ రెడ్డి అభ్యంతరం

28-11-2020 Sat 11:37
  • మోదీ గారు ఈ రోజు భారత్ బయోటెక్ కు రానున్నారు
  • హకీంపేట ఏఎఫ్ఎస్‌లో ఆయన ల్యాండ్ అవుతారు
  • అవి రెండు మల్కాజిగిరి నియోజక వర్గం కిందకు వస్తాయి
  • స్థానిక పార్లమెంటు సభ్యుడిని పిలవకపోవడం సరికాదు
its uncourteous on the part of the PM to not invite the local Member of Parliament
దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సమీక్షించేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి నేరుగా జైడస్‌ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న జైకోవ్‌-డీ టీకా ప్రయోగాలను మోదీ పరిశీలించిన అనంతరం హైదరాబాద్‌, పుణెల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుని భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ ను పరిశీలించి, శాస్త్రవేత్తలతో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

‘గౌరవనీయులైన ప్రధాని మోదీ గారు ఈ రోజు భారత్ బయోటెక్ కు రానున్నారు. హకీంపేట ఏఎఫ్ఎస్‌లో ఆయన ల్యాండ్ అవుతారు. అవి రెండు మల్కాజిగిరి నియోజక వర్గం కిందకు వస్తాయి. ఇక్కడ మోదీ పర్యటన నేపథ్యంలో స్థానిక పార్లమెంటు సభ్యుడిని పిలవకపోవడం సరికాదు’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దేశంలోని జాతీయ మీడియా సంస్థలన్నింటి హ్యాష్‌ట్యాగ్‌లను ఈ సందర్భంగా ఆయన జోడించారు.