Akbaruddin Owaisi: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసుల నమోదు

SR Nagar Police files case against bandi sanjay and akbaruddin owaisi
  • రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామన్న బండి సంజయ్
  • ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చివేసే దమ్ముందా? అన్న అక్బరుద్దీన్
  • సెక్షన్ 505 కింద కేసులు నమోదు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు  
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలపై పోలీసులు నేడు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 505 కింద కేసులు నమోదు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంజయ్, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో సామాజిక ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ.. పాతబస్తీలో రోహింగ్యాలు నివసిస్తున్నారని, వారిపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని అన్నారు. అలాగే, ఓ సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. హుస్సేన్ సాగర్‌ను ఆక్రమించి ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాధులను నిర్మించారని, వాటిని కూల్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు.

అదే జరిగితే రెండు గంటల్లో దారుస్సలాం కూలిపోతుందని బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. వీరి సవాళ్లతో సామాజికంగా ఘర్షణలు రేకెత్తే ప్రమాదం ఉందంటూ పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు.
Akbaruddin Owaisi
Bandi Sanjay
BJP
MIM
police case

More Telugu News