హైదరాబాద్‌లో సంజయ్ దత్‌ను కలిసిన కంగన రనౌత్

27-11-2020 Fri 15:27
  • సంజయ్ ఉంటోన్న హోటల్‌లో కంగన
  • ఆయన గదికి వెళ్లి కలిసి ఫొటో దిగిన హీరోయిన్
  • గతంలోకంటే ఇప్పుడు చాలా అందంగా ఉన్నాడని ట్వీట్ 
kangana meets sanjay dut

బాలీవుడ్  నటుడు సంజయ్‌ దత్‌ను హీరోయిన్  కంగన రనౌత్‌  హైదరాబాదులో కలిసింది. వారిద్దరు అనుకోకుండా హైదరాబాద్‌లోని ఒకే హోటల్‌లో ఉంటున్నారు. సంజయ్ దత్ కూడా తాను ఉంటోన్న హోటల్లోనే ఉంటున్నారని తెలుసుకున్న కంగన ఈ సందర్భంగా ఆయన ఉంటోన్న గదికి వెళ్లి కలిసింది.

ఆయనతో దిగిన ఫొటోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆయన గతంలోకంటే ఇప్పుడు చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆమె పేర్కొంది. ఈ విషయం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఆయన ఎప్పుడూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించింది. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌ 'తలైవి' సినిమా షూటింగ్‌ కోసం కంగన హైదరాబాద్‌లో ఉంటోంది. కన్నడ హీరో‌ యశ్‌ హీరోగా నటిస్తోన్న 'కేజీఎఫ్‌ 2'లో పవర్ ఫుల్ అధీరా పాత్రలో సంజయ్‌ దత్ నటిస్తున్నారు.