హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన ఆస్ట్రేలియా ఓపెనర్లు.. భారత బౌలర్లు బేజారు

27-11-2020 Fri 11:15
  • ఆస్ట్రేలియా స్కోరు 134/0
  • 59 పరుగులు చేసిన వార్నర్
  • 61 రన్స్ తో క్రీజులో ఉన్న ఫించ్
Australian openers scores half centuries in 1st ODI against India

సిడ్నీలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫించ్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్నారు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఇప్పటి వరకు ఐదుగురు బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 25 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 59 (67 బంతులు, 5 ఫోర్లు), ఫించ్ 61 (84 బంతులు, 1 సిక్సర్, 5 ఫోర్లు) అద్భుతంగా ఆడుతున్నారు.