ఇండియా-ఆస్ట్రేలియా వన్డే.. నిలకడగా ఆడుతున్న ఆసీస్

27-11-2020 Fri 10:09
  • తొలి 10 ఓవర్లో 51 పరుగులు చేసిన ఆసీస్
  • క్రీజులో 29 పరుగులతో ఫించ్, 20 పరుగులతో వార్నర్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
Aus scores 51 runs in 10 overs

ఇండియాతో సిడ్నీలో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఇన్నింగ్స్ ను డేవిడ్ వార్నర్, ఫించ్ ప్రారంభించారు. ఇండియా బౌలింగ్ ను మహమ్మద్ షమీ, బుమ్రా ప్రారంభించారు. వార్నర్, ఫించ్ ఇద్దరూ నిలకడగా ఆడుతూ.. లూజ్ బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ క్రమంలో 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 51 పరుగులు చేసింది. వార్నర్ 20 పరుగులతో, ఫించ్ 29 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఫించ్ 4, వార్నర్ 2 బౌండరీలను బాదారు. 10 ఓవర్లతో ఆస్ట్రేలియా రన్ రేట్ 5.1గా ఉంది. మరోవైపు ఫించ్ తన వన్డే కెరీర్లో 5 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.