Hyderabad: ఎల్బీ స్టేడియంలో రేపు కేసీఆర్ బహిరంగ సభ.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

KCR meeting tomorrow in LB Stadium traffic restrictions in city
  • టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు భారీ బహిరంగ సభ
  • ట్రాఫిక్ మళ్లింపులపై పోలీసుల సూచన
  • ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రేపు ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. నగర వాసులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఆంక్షలున్న ప్రాంతాల్లోకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ కుమార్ తెలిపారు.

పోలీసు కంట్రోల్ రూము నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం చౌరస్తా వైపు అనుమతించరు. కాబట్టి ఏఆర్ పెట్రోలు బంక్, చాపెల్ రోడ్డు వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది. అబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఎస్‌బీఐ (గన్‌ఫౌండ్రి) నుంచి చాపెల్ రోడ్డువైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి అబిడ్స్ జీపీవో వైపు వచ్చే వారిని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ ‌కోటి రోడ్డువైపు మళ్లిస్తారు.

అలాగే, హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
Hyderabad
GHMC Elections
TRS
KCR

More Telugu News