సముద్రంలో కూలిపోయిన మిగ్ 29కే... సెర్చ్ ఆపరేషన్ మొదలు!

27-11-2020 Fri 09:58
  • ఇద్దరు పైలెట్లతో వెళ్లిన మిగ్
  • అరేబియా సముద్రంలో కూలిన విమానం
  • రెండో పైలట్ కోసం వెతుకులాట
MIG 29K Crashed in Arebian Sea

నిన్న రాత్రి అరేబియా సముద్రంలో ఇద్దరు పైలెట్లతో వెళుతున్న మిగ్-29కే యుద్ధ విమానం కూలిపోగా, సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించారు. విమానం కూలిపోయే ముందు ఇద్దరు పైలట్లూ బయట పడ్డారని, ఓ పైలట్ క్షేమంగా బయట పడ్డారని, రెండో పైలట్ కోసం వెతుకులాట కొనసాగుతోందని భారత నౌకాదళ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై విచారణకు ఆదేశించామని తెలిపింది.

కనిపించకుండా పోయిన పైలట్ కోసం వాయుసేనతో పాటు సైన్యం సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని అన్నారు. ఈ యుద్ధ విమానం గోవా సమీపంలో మోహరించివున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి తన నిఘా కార్యకలాపాల నిమిత్తం పని చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇండియా వద్ద 40 మిగ్-29కే ఫైటర్ జెట్స్ ఉన్న సంగతి తెలిసిందే.