Ponguleti Sudhakar Reddy: సంజయ్ సర్జికల్ స్ట్రయిక్స్ వ్యాఖ్యలపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వివరణ

Ponguleti Sudhakar Reddys explanation on Bandi Sanjays surgical strikes comments
  • అవినీతి, అక్రమ పాలనపైనే సర్జికల్ స్ట్రయిక్స్
  • పాకిస్థాన్ కు మద్దతు పలుకుతున్న వారిపైనే సర్జికల్ స్ట్రయిక్స్
  • కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు
'బిడ్డా... హైదరాబాద్ మేయర్ పీఠాన్ని గెలిచిన తర్వాత నీ ఏరియాకి వచ్చి సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాం. రోహింగ్యాలను, పాకిస్థానీలను తరిమితరిమి కొడతాం' అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్, ఎంఐఎం మండిపడ్డాయి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తారా? అని మండిపడ్డాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వివరణ ఇచ్చారు.

బండి సంజయ్ చెప్పిన సర్జికల్ స్ట్రయిక్స్ అవినీతి, అక్రమ పాలన, చొరబాటుదారులపై ఉంటుందని పొంగులేటి చెప్పారు. హైదరాబాదులో ఉంటూ, ఇక్కడి గాలి పీల్చుతూ, ఇక్కడి తిండి తింటూ పాకిస్థాన్ కు మద్దతు పలుకుతున్న వారిపైనే సర్జికల్ స్ట్రయిక్స్ ఉంటాయని తెలిపారు. హైదరాబాదును విశ్వనగరంగా చేస్తామన్న టీఆర్ఎస్ పార్టీ... చివరకు విషాద నగరంగా మార్చిందని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకునే పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని... అదొక మునిగిపోయే పార్టీ అని అన్నారు.
Ponguleti Sudhakar Reddy
Bandi Sanjay
BJP
Surgical Strikes

More Telugu News