fake news: ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందంటూ వాట్సాప్‌లో నకిలీ వార్త వైరల్!

  • లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన చాలా మంది ప్రజలు 
  • ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న సామాన్యులు 
  • 18 ఏళ్ల వయసు దాటిన వారికి కరోనా నిధులంటూ ఫేక్ న్యూస్
  • రూ.1,30,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిందని వార్త
fake news goes viral on whats app

కరోనా విజృంభణను అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి చాలా మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. దీంతో కరోనా ఫండ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో కేటగాళ్లు అనేక రకాలుగా మోసాలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ఆర్థిక సాయం అందిస్తోందని మెసేజ్ లు పెడుతూ దాన్ని నమ్మిన వారిని నట్టేటముంచుతున్నారు.

18 ఏళ్ల వయసు దాటిన ప్రతి పౌరుడికి కరోనా నిధుల కింద  రూ.1,30,000 ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటన చేసిందని తాజాగా వాట్సప్ లో ఓ ప్రచారం వైరల్ అవుతోంది. ఈ డబ్బును అందుకోవాలంటే పూర్తి వివరాలు నమోదు చేయాలని పేర్కొంటూ, ఓ లింక్‌ను పంపుతున్నారు. అయితే, దాన్ని క్లిక్ చేయొద్దని, ఆ ప్రచారంలో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. పీఐబీ ఫాక్ట్-చెక్ బృందం ఈ మేరకు ట్విట్టర్లో ఈ ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని తెలిపింది.

More Telugu News