Samantha: ఉదయం 5 గంటలకే నిద్రలేస్తా: హీరోయిన్ సమంత

samanta awakes at at 5am
  • ఉదయాన్నే జాగింగ్ చేస్తాను
  • జిమ్ లోనే మూడు గంటలు గడుపుతా
  • మొక్కల పెంపకం వంటి పనుల్లో పాల్గొంటా  
హీరోయిన్ సమంత ఎప్పుడూ చాలా చలాకీగా కనపడుతూ ఉంటుంది. తను అంత హుషారుగా ఉండడం వెనుక సీక్రెట్‌పై తాజాగా పలు విషయాలను చెప్పింది. తాను ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తానని, అనంతరం జాగింగ్ ప్రారంభించి, జిమ్ లోనే మూడు గంటలు గడుపుతానని తెలిపింది.

అనంతరం మొక్కల పెంపకం వంటి పనుల్లో పాల్గొంటానని చెప్పింది. ఈ మధ్యే తన ఇంటిపైనే ఆమె మొక్కలను పెంచడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆమె అక్కడే ఎక్కువ సమయం గడుపుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ డిజిటల్ మీడియాలో ఆమె బిజీగా ఉంటోంది. అంతేకాదు, ఇటీవలే ఆమె వస్త్ర వ్యాపారం కూడా ప్రారంభించింది. మరోపక్క, ‘సామ్ జామ్’ పేరుతో ‘ఆహా’లో ఓ షోలో వ్యాఖ్యాతగా కనపడుతోన్న సమంత పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఆహా అనిపిస్తోంది.
Samantha
Tollywood

More Telugu News