రెండు గంటల్లో మీ దారుస్సలాంను కూల్చేస్తాం: ఒవైసీకి బండి సంజయ్ సవాల్

25-11-2020 Wed 15:19
  • ఎన్టీఆర్, పీవీ ఘాట్లను కూల్చాలన్న అక్బరుద్దీన్ ఒవైసీ
  • అవేమైనా నీ అయ్య జాగీరా? అని మండిపడ్డ సంజయ్
  • హిందువులు ఓటు బ్యాంకుగా మారితే బీజేపీ గెలుస్తుందని వ్యాఖ్య
Within 2 hours our karyakarthas will demolish your Darussalam says Bandi Sanjay

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తాజాగా మాట్లాడుతూ హుస్సేన్ సాగర్ పై ఉన్న ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ మాట్లాడుతూ, వాటిని కూల్చే దమ్ము నీకుందా? అని మండిపడ్డారు. కూల్చడానికి అవి నీ అయ్య జాగీరా? లేక నీ తాత జాగీరా? అని మండిపడ్డారు. అది జరిగిన రెండు గంటల్లో మీ దారుస్సలాంను తమ కార్యకర్తలు కూల్చేస్తారని హెచ్చరించారు.

తమ మధ్య పొత్తు లేదని ఓటర్లను టీఆర్ఎస్, ఎంఐఎంలు మభ్యపెడుతున్నాయని సంజయ్ విమర్శించారు. ఏమార్చి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎంఐఎం చేస్తున్న సవాళ్లను కూడా టీఆర్ఎస్ నేతలు స్వీకరించడం లేదని అన్నారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే హైదరాబాదులో బీజేపీ గెలుస్తుందని చెప్పారు.