Talasani: రోహింగ్యాలపై ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు: తలసాని

What Bandi Sanjay knows about Hyderabad asks Talasani
  • ఇన్ని రోజులు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమైంది?
  • చర్యలు ఎందుకు తీసుకోలేదు?
  • కరీంనగర్ లో ఉండే బండి సంజయ్ కి హైదరాబాద్ గురించి ఏం తెలుసు?
హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారని... ఇన్ని రోజులు ఏం చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఇన్ని రోజులు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమైందని అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి  చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రోహింగ్యాలపై ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అన్నీ అసత్యాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

ఎంత సేపూ టీఆర్ఎస్ పై పడి ఏడవటం కాదని... హైదరాబాదుకు ఏం చేస్తారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో ఉండే బండి సంజయ్ కి హైదరాబాద్ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ హయాంలో హైదరాబాదులో జరిగిన అభివృద్ధి కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీకి దమ్ముంటే వారి విరోధులను దేశ బహిష్కరణ చేయాలని సవాల్ విసిరారు.
Talasani
Bandi Sanjay
TRS
BJP
GHMC Elections
Kishan Reddy

More Telugu News