టీడీపీ కార్యకర్తలను చూసి పులివెందుల పిల్లి భయపడుతోంది: నారా లోకేశ్ విమర్శలు

25-11-2020 Wed 14:37
  • సగం గోడ కట్టిన దాన్ని వైసీపీ ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటు 
  • వైసీపీ నాయకులు ఆడమన్నట్టు కొందరు పోలీసులు ఆడుతున్నారు 
  • దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు
Nara Lokesh calls Jagan as Pulivendula Pilli

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందుల పిల్లి అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలను చూసి పులివెందుల పిల్లి భయపడుతోందని అన్నారు. పొన్నూరులో సగం గోడ కట్టిన కట్టడాన్ని ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటని చెప్పారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు పొన్నూరులో టీడీపీ కార్యకర్త మణిరత్నాన్ని పోలీసులు అక్రమ అరెస్ట్ చెయ్యడం జగన్ పిరికితనాన్ని బయటపెట్టిందని అన్నారు.

మణిరత్నం పెట్టిన పోస్ట్ లో తప్పేముందో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు ఆడమన్నట్టు కొందరు పోలీసులు ఆడుతున్నారని... ఇలాంటి అక్రమ అరెస్టులతో కష్టాలను కొనితెచ్చుకోవడం తప్ప, సాధించేది ఏమీ ఉండదని ట్వీట్ చేశారు.