Nivar: తెల్లవారుజాము నుంచి తిరుమలలో దంచి కొడుతున్న వాన!

Heavy Rain in Tirumala
  • నివర్ ప్రభావం తిరుమల గిరులపై
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు
  • తడుస్తూనే స్వామివారి దర్శనానికి
బంగాళాఖాతంలో పొంచివున్న నివర్ తుపాను ప్రభావం తిరుమలపై పడింది. ఈ తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతుండగా, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలోనూ తడుస్తూనే స్వామి దర్శనానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే తరహా వాతావరణం మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశిస్తున్న నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసేందుకు ప్రత్యేక మోటార్లను వినియోగిస్తున్నారు.

ఇక చలి గాలుల తీవ్రత కూడా తిరుమలలో అధికంగా ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో నడక దారిలో వస్తున్న భక్తులతో పాటు, ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగి పడవచ్చన్న అంచనాతో, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఉదయం భక్తుల సంఖ్య కూడా తిరుమల కొండపై పలుచగానే ఉంది.
Nivar
Cyclone
Tirumala
Piligrems

More Telugu News