Rashmika Mandanna: అవును.. నేను పంది మాంసం తింటా: హీరోయిన్ ర‌ష్మిక‌

rashmika Explains her diet habits
  • కాల్చుకుని తింటే అది చాలా బాగుంటుంది
  • మేము ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటాం
  • పంది మాంసం, వైన్‌తో రకరకాల వంట‌లు చేసుకుంటాం
  • నిద్ర పోయే ముందుకు 2 క‌ప్పుల వైన్ తాగితే  హాయిగా నిద్ర
తాను పంది మాంసం తింటానని, కాల్చుకుని తింటే అది చాలా బాగుంటుందని హీరోయిన్ రష్మిక చెప్పింది. హీరో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న యుఆర్ లైఫ్ అనే వెబ్ సైట్ ద్వారా ప్రజలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్లను తీసుకొచ్చి ఆరోగ్యకరమైన వంట‌లు వండిస్తోంది.

తాజాగా ర‌ష్మిక‌తో  వంటలు చేయించింది. ఈ సందర్భంగా ఆమెతో రష్మిక మాట్లాడుతూ తన ఆహార అలవాట్లను గురించి చెప్పింది. ‘కోలీ పుట్టు’ అనే కూరను ర‌ష్మిక వండింది. దీంతో ఆమెను ఉపాస‌న ప్రశంసిస్తూ పలు ప్రశ్నలు అడిగింది. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా? అని, పంది మాంసం బాగా తింటారు కదా? అని ప్రశ్నలు వేసింది.

దీంతో రష్మిక స్పందిస్తూ...  అవునని చెప్పింది. తాము ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటామని, అలాగే పంది మాంసం తింటామని, ఆ మాంసాన్ని కాల్చుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందని చెప్పింది. పంది మాంసం, వైన్‌తో రకరకాల వంట‌లు చేసుకుంటామ‌ని తెలిపింది. నిద్ర పోయే ముందు రెండు క‌ప్పుల వైన్ తాగితే  హాయిగా నిద్ర ప‌డుతుంద‌ని వివరించింది.
Rashmika Mandanna
Tollywood
upasana

More Telugu News